Sunday, October 2, 2022
Sunday, October 2, 2022

రాష్ట్రానికి వర్ష సూచన

దీంతో ఏపీలో వివిధ ప్రాంతాల్లో రాగల మూడు రోజుల వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘ఉపరితలద్రోణి’ నుండి దక్షిణ ఇంటీరియర్‌ కర్ణాటక, రాయలసీమల మీదుగా ఆంధ్రప్రదేశ్‌ తీరాన్ని ఆనుకుని పయనిస్తుంది. దీంతో ఉపరితలద్రోణి పశ్చిమమధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 %సఎ% ఎత్తు వరకు విస్తరించి ఏర్పడిరది. దీంతో ఈనెల 10 వ తేదీన ఉత్తర అండమాన్‌ సముద్రం నందు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ ప్రభావంతో ఈరోజు, రేపు, ఎల్లుండి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర కోస్తా ఆంధ్రా, దక్షిణ కోస్తాఆంధ్రా, రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉందని తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img