Tuesday, December 5, 2023
Tuesday, December 5, 2023

రాష్ట్రాన్ని అప్పుల పాలుచేసిన జగన్‌

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు

రెండేళ్ల పాలనలోనే రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం బంటుమిల్లి మండల పర్యటనకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం జగన్‌ పరిపాలన కారణంగా రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. విద్యార్థుల చదువులు అటకెక్కాయని, ఉద్యోగాలు లేవు.. గ్రామాల్లో రోడ్లు లేవు.. అసలు అభివృద్ధి అంటే ఏమిటో ముఖ్యమంత్రికి తెలుసా అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అప్పులు పాలుచేయడం, జల్సాలు చేయటం, దోచుకోవడం తప్ప రాష్ట్రంలో ఎక్కడా పార మట్టి వేసి అభివృద్ధి చేసిన దాఖలాలు లేవన్నారు. మద్యం తయారీ, అమ్మకాలు అంతా ఆయనేనని, అధిక రేట్లకు కొనుగోలు చేసి ప్రజలు నష్టపోవాల్సి వస్తోందని చంద్రబాబు తెలిపారు. ఇసుక ధర, కరెంటు చార్జీలు, చివరికి చెత్తపై కూడా పన్ను వేసి ప్రజలను దోచుకుంటున్నారని అన్నారు. రైతులు ఆరుగాలం కష్టించి పండిరచిన ధాన్యం సొమ్ములు కోసం నెలల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి దాపురించిందని చెప్పారు. అదేమని అడిగితే అరెస్టులు, బెది రింపులు చేయటం దారుణమన్నారు. ప్రజలందరూ ధైర్యంగా ఉంటే పోలీసులు కూడా ఏమీ చేయలేరని అన్నారు. నదుల అనుసంధానమే సాగు నీటి సమస్యకు సరైన పరిష్కారమని చెప్పారు. 25 ఎంపీలు ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానన్న జగన్‌ కేంద్ర ప్రభుత్వానికి తలొగ్గారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర పరిపాలన అంతా హోల్‌సేల్‌ అవినీతిగా తయారైందన్నారు. లక్ష నుండి రెండు లక్షల కోట్ల రూపాయల అమరావతి సంపదను సృష్టిస్తే ధ్వంసం చేసి రాజధానిని నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని దివాలా తీసేలా పరిపాలన చేశారని దుమ్మెత్తి పోశారు. కాగా ఏడాది ముందు పెడన నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పేరు ప్రకటించాలని కార్యకర్తలు కోరగా, నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఎమ్మెల్యేనే అభ్యర్థి అని చంద్రబాబు అన్నారు. కాగిత కృష్ణప్రసాద్‌ ఈ ప్రాంత ప్రజలు అండగా ఉండాలని కోరారు. చంద్రబాబు పర్యటన సమయంలో జోరున వర్షం కురుస్తున్నా వందలాది మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు చంద్రబాబును చూసేందుకు తరలి రావడం విశేషం. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, మాజీ ఎమ్మెల్యేలు నెట్టెం రఘురాం, బోడె ప్రసాద్‌, కొనకళ్ల జగన్నాధరావు (బుల్లయ్య), పెడన నియోజకవర్గ ఇన్‌ఛార్జి కాగిత కృష్ణప్రసాద్‌, నాదెళ్ల బ్రహ్మం, చెన్నుపాటి గాంధీ, నాలుగు మండలాల టీడీపీ నాయకులు బొల్ల వెంకన్న, ఇల్లూరి లీలా కృష్ణ, కూనపరెడ్డి వీరబాబు, పోతన స్వామి నాయుడు, బొడ్డు వేణుగోపాల్‌ రావు, హన్ను, ఓడుగు తులసి రావు, కూనసాని చిన్న, నెక్కంటి భాస్కరరావు, పిన్నింటి రత్తయ్య, పాలడుగుల వెంకటేశ్వరరావు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img