Tuesday, September 27, 2022
Tuesday, September 27, 2022

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వచ్చిన ఢోకా ఏమీ లేదు : సీఎం జగన్‌

రాష్ట్రం ఆర్థికంగా బాగానే ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో పెట్టుబడులు, పారిశ్రామిక ప్రగతిపై చర్చ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ..రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వచ్చిన ముప్పు ఏమీ లేదన్నారు. ఆర్థికంగా రాష్ట్రం బాగుందని చెబితే కొందరు ఆ వాస్తవాన్ని జీర్ణించుకోలేరని అన్నారు. రాష్ట్రానికి నిధులు రానివ్వకపోతే పథకాలు ఆగిపోతాయని కొన్ని శక్తులు అనుకుంటున్నాయన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో 98.4శాతం నెరవేర్చామన్నారు.కొవిడ్‌ సహా ఎన్నో సవాళ్లు ఎదురైనా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా ఉందన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వచ్చిన ఢోకా ఏమీ లేదని స్పష్టంచేశారు. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉందని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు అండ్‌ దొంగల ముఠా లేనిది సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. మీడియా వ్యవస్థలను చేతిలో పెట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తప్పుడు కేసులతో కొన్ని శక్తులు పథకాలను అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img