Tuesday, January 31, 2023
Tuesday, January 31, 2023

రాష్ట్ర పోలీస్‌ శాఖకు ఐదు జాతీయ అవార్డులు

డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌
ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ శాఖకు ఐదు జాతీయస్థాయి అవార్డులు వచ్చాయని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. టెక్నాలజీ విభాగంలో ఈ ఐదు అవార్డులు వచ్చాయని తెలిపారు. డిజిటల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ ద్వారా ఏపీ పోలీసు శాఖలోని సిబ్బంది ఆరోగ్య సమాచారమంతా పొందుపరచామని, దీనికి కూడా అవార్డు దక్కిందన్నారు.పాస్‌పోర్ట్‌ సేవలోనూ దేశంలోనే ఏపీ అగ్రస్ధానంలో ఉందని తెలిపారు. ఈ రోజు ఏపీ పోలీసులు గర్వించదగ్గ రోజని పేర్కొన్నారు. గడిచిన రెండేళ్లలో ఇప్పటి వరకు 130 అవార్డులు ఏపీ పోలీస్‌ శాఖకి దక్కాయయని, ఈ అవార్డులు పోలీస్‌ శాఖపై మరింత బాద్యత పెంచాయని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img