Monday, October 3, 2022
Monday, October 3, 2022

రాష్ట్ర ప్రజలకు రక్షాబంధన్‌ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్‌

ముఖ్యమంత్రి జగన్‌ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధన్‌ ఆత్మీయత, అనురాగాల పండుగ అని ఆయన అన్నారు. రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలందరికీ దేవుడి చల్లని దీవెనలు, ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు.మరోవైపు బాపట్లలో జరుగుతున్న జగనన్న విద్యాదీవెన పథకం కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. బాపట్ల ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, కోన రఘుపతి, పోతుల సునీత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా… రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలకు రాఖీ పండుగ శుభాకాంక్షలను తెలిజేస్తున్నానని చెపుతూ సీఎం తన ప్రసంగాన్ని ప్రారంభించారు.మరోవైపు రాఖీ పౌర్ణమి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రికి వైసీపీ మహిళా నేతలు రాఖీలు కట్టి ఆత్మీయతను పంచుకున్నారు. రాఖీలు కట్టిన వారిలో మంత్రులు విడదల రజని, తానేటి వనిత, మహిళా కమిషన్‌ ఛైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ, విజయవాడ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి తదితరులు ఉన్నారు. బ్రహ్మకుమారీలు కూడా రాఖీలు కట్టారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img