రాష్ట్రంలో ప్రజలు ప్రభుత్వ మార్పును కోరుకుంటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఏడు జిల్లాల్లో లక్షల మందికి చేరువగా పర్యటన సాగిందని చెప్పారు. ప్రజలపై పన్నులు, అధిక ధరల భారం పడిరదని, దీనిపై ప్రజలు తన ముందు ఆవేదన చెందారని ఆయన అన్నారు. వారి ఆవేదన ప్రభుత్వ వ్యతిరేకతను చాటిందని, ప్రజలు మార్పును కోరుకుంటున్న తీరు స్పష్టమైందని అన్నారు. ప్రజల్లో టీడీపీపై కనిపిస్తున్న ఆసక్తి రానున్న మార్పును సూచిస్తోందని తెలిపారు. తన పర్యటనను విజయవంతం చేసిన కార్యకర్తలు, ప్రజలకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.