Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని చంద్రబాబు ఎప్పుడో కోల్పోయారు

మంత్రి సురేష్‌
రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని చంద్రబాబు ఎప్పుడో కోల్పోయారని, ఇప్పుడు స్థానిక మున్సిపల్‌ ఎన్నికలలో సొంత నియోజకవర్గం కుప్పం ప్రజలు కూడా ఆయనను తిరస్కరించారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఎద్దేవా చేశారు.రాబోయే రోజుల్లో ఏ ఎన్నిక జరిగినా టీడీపీకి దారుణ పరాభవం తప్పదని అన్నారు. కుప్పం మా అడ్డా అని గొంతు చించుకున్న చంద్రబాబు, లోకేష్‌ ఇప్పుడేమంటారని ఆయన ప్రశ్నించారు. దొంగ ఓట్లు అన్నారు, కౌంటింగ్‌ రికార్డు చేయాలన్నారన్నారు. అధికారులకు ఫిర్యాదులు చేస్తూ గగ్గోలు పెట్టారన్నారు. ఇన్ని చేసినా ప్రజా తీర్పును మార్చలేరుగా అని అన్నారు. ఈ విజయంతో జగన్మోహన్‌ రెడ్డిపై ప్రజలకున్న విశ్వాసం రోజురోజుకు రెట్టింపవుతుందన్నారు. అందుకు నిదర్శనమే ఇప్పటి ఫలితాలని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img