Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

రెండేళ్లు సర్వీస్‌ ఉన్నవారే బదిలీలకు అర్హులు..

ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించిన కసరత్తును విద్యాశాఖ అధికారులు తుది మెరుగులు దిద్దుతున్నారు. టీచర్ల బదిలీలు, పదోన్నతుల మార్గదర్శకాలను మార్పులు చేర్పులతో దాదాపు ఖరారు చేశారు. పాఠశాలలో రెండేళ్ల సర్వీసు నిండిన ఉపాధ్యాయులకు మాత్రమే బదిలీలకు అవకాశం కల్పించనున్నారు. గతంలోనూ ఇదే నిబంధన ఉండేది. దీన్నే యథావిధిగా అమలు చేయాలని అధికారులు నిర్ణయిం చారు. అయితే బదిలీలకు ఉపాధ్యాయులందరూ దరఖాస్తు చేసుకునే విధంగా పాఠశాలల్లో కనీసం రెండు సంవత్సరాల సర్వీసు ఉండాలనే నిబంధనను సడలించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ అంశం ఇంకా ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అధికారులు రూపొందించిన మార్గదర్శకాల్లో మాత్రం ఈఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నాటికి ఒక పాఠశాలలో రెండు సంవత్సరాలు సర్వీస్‌ నిండిన వారు బదిలీలకు అర్హులుగా నిర్ణయించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img