విజయవాడలోని ఎన్టీఆర్ వర్సిటీ ఉద్యోగులు నిరసన బాటపట్టారు.వర్సిటీ నిధుల మళ్లింపునకు నిరసనగా బుధవారం నుంచి విధుల బహిష్కరణకు పిలుపు ఇచ్చారు.ఈ నేపథ్యంలో వర్సిటీ ఉద్యోగ, విద్యార్థి సంఘాలు ఐకాసగా ఏర్పడ్డాయి. అంతకుముందు ఉద్యోగులు సమావేశమై చర్చించారు. సమావేశం ముగిసిన అనంతరం వర్సిటీ ప్రాంగణంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ఆందోళనకు విద్యార్థి సంఘాలు సంఫీుభావం తెలిపాయి.