ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో మంగళవారం సీఎం జగన్ భేటీ కానున్నారు. ఉభయరాష్ట్రాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సీఎం జగన్ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. సీఎం జగన్ మంగళవారం భువనేశ్వర్ వెళ్లనున్నారు. ఉభయరాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో చర్చించనున్నారు. ఈ సందర్భంగా మూడు అంశాలపై ఒడిశా సీఎంతో సీఎం జగన్ చర్చించనున్నారు. వంశధారపై నేరడి వద్ద బ్యారేజీ నిర్మాణం, జంరaావతి ప్రాజెక్టు, కొఠియా గ్రామాల అంశాలపై చర్చించనున్నారు.