Monday, March 20, 2023
Monday, March 20, 2023

రేపు విశాఖలో పర్యటించనున్న సీఎం జగన్‌

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 27న విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ‘మిలాన్‌2022’ యుద్ధ నౌకల సమాహారంలో భాగంగా నిర్వహించే ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు. ఆదివారం మ.2.30 గంటలకు ఆయన విశాఖకు చేరుకుంటారు.ఆ తర్వాత నావల్‌ డాక్‌యార్డ్‌కు వెళ్లి అక్కడ జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం ఐఎన్‌ఎస్‌ వేలా సబ్‌మెరైన్‌ సందర్శిస్తారు. అక్కడి నుంచి ప్రభుత్వ సర్క్యూట్‌ హౌస్‌కు వెళ్తారు. సా.5.30 గంటలకు ఆర్‌కే బీచ్‌కు చేరుకుని ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌ మిలాన్‌2022లో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం రాత్రి 7.15 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్ట్‌ నుంచి గన్నవరం బయల్దేరుతారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img