Monday, August 15, 2022
Monday, August 15, 2022

రైతులకు గరిష్ఠ లబ్ధి చేకూరాలి : సీఎం జగన్‌

రాష్ట్రంలోని రైతులకు గరిష్ట లబ్ధి చేకూర్చేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు.శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో వ్యవసాయంపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగంపైనా ప్రధానంగా చర్చించారు. డ్రోన్ల వినియోగంపై మాస్టర్‌ ట్క్రెనర్లను తయారు చేయాలన్న ఆయన.. డ్రోన్ల నిర్వహణ, మరమ్మతుపై శిక్షణ ఇచ్చే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులతో చెప్పారు. అంతేకాదు.. నియోజకవర్గానికి ఒక ఐటీఐ లేదంటే ఒక పాలిటెక్నిక్‌ కాలేజీలోని విద్యార్థులకు డ్రోన్ల వినియోగం, నిర్వహణ, మరమ్మతులపై సంపూర్ణ శిక్షణ ఇప్పించాలని సూచించారు. రైతులకు ఎరువులు అందించడంలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని సంబంధిత మంత్రిత్వశాఖను, అధికారులను ఆయన ఆదేశించారు. అంతేకాదు ఎక్కడ నుంచి ఎలాంటి సమాచారం వచ్చినా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆర్బీకేల్లో ఉన్న అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ నుంచి ప్రతి రోజూ నిరంతరం సమాచారం తెప్పించుకోవాలన్న సీఎం జగన్‌.. విత్తనాల సరఫరా, ఎరువుల పంపిణీ, వ్యవసాయ ఉత్పత్తులకు అందుతున్న ధరలు తదితర అంశాలపై పర్యవేక్షణ ఉండాలని తెలిపారు. ఈ-క్రాప్‌ వందశాతం పూర్తిచేయాలని, వైయస్సార్‌ ఉచిత పంటల బీమా పథకంతో ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన భాగస్వామ్యం కానుందని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img