Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

రైతుల భూములను లాక్కుంటున్నారు

రహదారుల నిర్మాణం మొత్తం పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్‌ కంపెనీల కోసమా..?
కేసీఆర్‌ఆర్‌ దళిత బంధును స్వాగతిస్తున్నా
ఓట్ల రాజకీయం కోసం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అమలుచేయాలి
వైజాగ్‌ స్టీల్‌ పై రాజకీయ పోరాటం అవసరం
2,3తేదీల్లో వైజాగ్‌ స్టీల్‌ పై ఢల్లీిలో ఆందోళన
విశాఖను స్మశానంగా మార్చి రాజధానిని ఆ ప్రాంతంలో పెడతారా..?
సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె. నారాయణ

జాతీయ హైవే రోడ్ల నిర్మాణం పేరుతో రైతుల భూములను బలవంతంగా ప్రభుత్వం లాక్కుంటూ తగు నష్టపరిహారం చెల్లించడం లేదన్నారు. బుధవారం తిరుపతి సీపీిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చిత్తూరు నుండి తాచ్చురు వరకు ఏర్పాటు చేస్తున్న రోడ్డు నిర్మాణంలో 8 మండలాలకు చెందిన రైతుల నుండి భూములు సేకరిస్తున్నారని, ఇందులో పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకుందని స్పష్టం చేశారు. లంచం ఇచ్చిన వారికి 70 లక్షలు ఇవ్వని వారికి 10 లక్షలు ఇస్తున్నారని అన్నారు. పరిహారం ధర ఎంతో చూపకుండా సంతకాలు తీసుకుంటున్నారని, సంతకం పెట్టకుంటే పింఛన్లు ఇవ్వమని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. 600 మంది రైతులు కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలియజేస్తే అధికారులు కనీస స్పందన లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని అన్నారు. భూముల నష్టపరిహారం పై ప్రశ్నించిన రైతులను అక్రమంగా అరెస్టు చేయించారని, దీనిపై ఆగస్టు 5వ తేదీ నుండి చిత్తూరు నుండి తచ్చురు వరకు చైతన్య యాత్ర చేపడతామని ప్రకటించారు. ఈ రోడ్లు కేవలం కార్పొరేట్‌, బడా పారిశ్రామికవేత్తల కోసం వేస్తున్నారని, ఆ రోడ్లపైకి రైతుల ట్రాక్టర్లను కూడా అనుమతి ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని స్వాగతిస్తున్నామని అయితే దీనిని కేవలం ఓట్ల రాజకీయం కోసం హుజురాబాద్‌లో పైలెట్‌ ప్రాజెక్టుగా చేపట్టామని చెప్పడం భావ్యం కాదని రాష్ట్రం మొత్తానికి అమలు చేయాలని కోరారు. కేసీఆర్‌ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని ఏపీ లో జగన్‌ అమలు చేయాలని సూచించారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 2,3 తేదీలలో ఢల్లీిలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతున్నామన్నారు. బీజేపీ పై వైసీపీ రాజకీయంగా ఎందుకు ఒత్తిడి తీసుకురావడం లేదని ప్రశ్నించారు. పోలవరం రాజకీయాల్లో నలిగిపోతూ ఉందని, నిర్వాసితులకు ఇవ్వాల్సిన 31 వేల కోట్ల రూపాయలు ఇప్పటివరకు చెల్లించలేదని అన్నారు. పోలవరం సాధన కోసం ఢల్లీిలో ఆగస్టు 5వ తేదీ ఆందోళన నిర్వహిస్తామన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు మాట్లాడుతూ, కృష్ణా జలాల సాధన కోసం హంద్రీనీవా గాలేరు-నగరి ప్రాజెక్టులు పూర్తిచేయాలని మదనపల్లెలో సదస్సు నిర్వహిస్తామన్నారు. మామిడి రైతులకు చెల్లించాల్సిన బకాయిలు గుజ్జు యజమానులు తక్షణం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో సీపీిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మురళి, నగర కార్యదర్శి విశ్వనాధ్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img