Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

లోకేష్‌ పాదయాత్రలో నందమూరి తారకరత్నకు తీవ్ర అస్వస్థత

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ యువగళం కుప్పంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. యువగళం పాదయాత్రలో స్పృహతప్పి పడిపోయారు.. తారకరత్నను వెంటనే కుప్పం పీఈఎస్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది.నారా లోకేష్‌ లక్ష్మీపురం శ్రీవరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజల పాదయాత్ర ప్రారంభించారు. అనంతరం కొద్దిదూరం నడిచిన అనంతరం.. అక్కడ మసీదులో లోకేష్‌ ప్రార్థనల్లో పాల్గొన్నారు. తారకరత్న కూడా లోకేష్‌ వెంట మసీదులోకి వెళ్లారు. మసీదు నుంచి బయటకు వచ్చే సమయంలో పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు, అభిమానుల తాకిడికి తారకరత్న సొమ్మసిల్లి పడిపోయినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img