Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

వరద బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలి

సీఎం జగన్‌
రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కలెక్టర్లను ఆదేశించారు. బాధితులు చెబుతోన్న సమస్యలను తెలుసుకొని ఉదారంగా స్పందించి తక్షణం నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. వరద బాధిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాల పురోగతిపై కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వరద బాధిత ప్రాంతాలైన కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమీక్షలో.. పాక్షికంగా దెబ్బతిన్న, పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు పరిహారం, 104 కాల్‌ సెంటర్‌కు వచ్చిన కాల్స్‌, వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యలు, రూ.2వేల రూపాయల అదనపు సహాయం పంపిణీ, నిత్యావసరాల పంపిణీ, అధికారుల క్షేత్రస్థాయి పర్యటన, రోడ్ల తాత్కాలిక పునరుద్ధరణ, చెరువుల భద్రత, గండ్లు పూడ్చివేత, తాగునీటి సరఫరా, గల్లంతైన వారికి నష్టపరిహారం, మరణించిన పశువులకు పరిహారం సహా పలు అంశాలను సీఎం సమీక్షించారు. సమావేశంలో కలెక్టర్లు వరద సహాయక చర్యల వివరాల సీఎం జగన్‌కు అందించారు. ప్రస్తుతం ఆయా జిల్లాల్లో కురుస్తున్న వర్షాలపైనా కూడా సమాచారం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. పంట నష్టంపై ఎన్యుమరేషన్‌ పూర్తయిన… వెంటనే సోషల్‌ఆడిట్‌ కూడా నిర్వహించాలని ఆదేశించారు. ఇళ్లులేని కారణంగా వారికి తాత్కాలిక వసతి ఏర్పాటు చేయాలి. వాటిలో కనీస సదుపాయాలను ఏర్పాటు చేయాలి.?మళ్లీ నివాస వసతి ఏర్పడేంతవరకూ కూడా వారిని జాగ్రత్తగా తీసుకోవాలని సూచించారు. త్యావసరాలు అందించిన ప్రతి కుటుంబానికి కూడా అదనపు సహాయం రూ.2వేలు అందాలన్నారు. అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లినప్పుడు వచ్చే విజ్ఞప్తులపై ఉదారంగా స్పందించాలని సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img