Sunday, April 2, 2023
Sunday, April 2, 2023

వరుణ్‌ తేజ్‌ పెళ్లి గురించి త్వరలో అనౌన్స్‌ చేస్తాం.. నాగబాబు

మెగా బ్రదర్‌ నాగబాబు ఇంట వెడ్డింగ్‌ బెల్స్‌ మోగనున్నాయి. తన తనయుడు వరుణ్‌ తేజ్‌ పెళ్లి గురించి తాజాగా నటుడు నాగబాబు ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రీసెంట్‌ ఇంటర్వ్యూలో నాగబాబు మాట్లాడుతూ.. వరుణ్‌ తేజ్‌ పెళ్లి గురించి త్వరలో అనౌన్స్‌ చేస్తాం. తన పెళ్లి గురించి వరుణ్‌ బాబు కూడా మీడియాకి అనౌన్స్‌ చేస్తారు. త్వరలోనే ఉంటుంది. ఇంటర్వ్యూలో యాంకర్‌ కోడలి గురించి ప్రస్తావించగా.. నేను ఇప్పుడే ఏమీ కామెంట్‌ చేయను అని నాగబాబు దాటవేశారు.ఒక ప్రముఖ వ్యక్తి మీ ఇంటికి కోడలిగా రాబోతోంది అది నిజమేనా అన్నట్లు యాంకర్‌ ప్రశ్నించగా నాగబాబు ఖండిరచలేదు. సమాధానం చెప్పకుండా దాటవేశారు.నాగబాబు అలా తన కోడలి గురించి హింట్‌ ఇచ్చినట్లే అని అంటున్నారు. దీనితో వరుణ్‌ లవ్‌ ఎఫైర్‌ గురించి వస్తున్న ఊహాగానాలు మరింత ఎక్కువయ్యాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img