. దర్యాప్తు వైఫల్యంతోనే పోలీసులకు క్లీన్‌చిట్
. అధికారులపై విచారణకు కోర్టు ఆదేశాలు
విశాలాంధ్ర బ్యూరో-విశాఖపట్నం: రాష్ట్రంలో సంచలనంగా మారిన వాకపల్లి కేసులో ఎట్టకేలకు తీర్పు వెలువడిరది. నిందితులుగా ఉన్న పోలీసులకు క్లీన్‌చిట్ లభించింది. జిల్లా న్యాయ సేవల యంత్రాంగం ద్వారా అత్యాచార బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని ఆరవ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి Ê ప్రత్యేక న్యాయస్థానం గురువారం ఆదేశాలిచ్చింది. ఈ తీర్పు వాకపల్లి బాధిత మహిళలు న్యాయపోరాటంలో విజయం సాధించారనేందుకు సూచికని ఆంధ్రప్రదేశ్ మానవహక్కుల ఫోరం పేర్కొంది. బాధితుల్లో ఇద్దరు చనిపోవడాన్ని గుర్తుచేసింది. ఇన్నేళ్లు న్యాయం కోసం వారు పోరాడటం ప్రశంసనీయమని ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై రాజేశ్, ఉభయ రాష్ట్రాల కో`ఆర్డినేషన్ కమిటీ సభ్యుడు వీఎస్ కృష్ణ గురువారం ఒక ప్రకటనలో వెల్లడిరచారు. ఎన్ని అవమానాలు ఎదురైనా మహిళలు ధైర్యంగా ఎదుర్కొన్నారని, తమకు తెలియని భాషలో క్రాస్ ఎగ్జామినేషన్‌ను తట్టుకున్నారని, ఇన్నేళ్లు న్యాయం కోసం ఎదురుచూశారని, నేడు వెలువడినది చరిత్రాత్మక తీర్పు అని వారు పేర్కొన్నారు. కాగా, నిష్పాక్షికంగా దర్యాప్తు చేయడంలో ఇద్దరు దర్యాప్తు అధికారులు విఫలమయ్యారని, అందువల్లే నిందితులకు క్లీన్‌చిట్ లభించిందని తీర్పు వెలువరించే సమయంలో న్యాయస్థానం వ్యాఖ్యానించింది. 8వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి, స్పెషల్ కోర్టు విచారణ దుర్మర్గంగా సాగడంతో పోలీసులు నిర్దోషులుగా రుజువయ్యారు. 2007 ఆగస్టు 20న అల్లూరి జిల్లా జి.మాడుగుల మండలం వాకపల్లి గ్రామంలో కూంబింగ్ నిర్వహించేందుకు వెళ్లిన 21 మంది పోలీసుల ప్రత్యేక బృందంపై అత్యాచార ఆరోపణలు వచ్చాయి. పోలీసులు అత్యాచారం చేశారని 11 మంది గిరిజన మహిళలు ఫిర్యాదు చేశారు. హైకోర్టు, సుప్రీంకోర్టులో సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత 2018లో విశాఖపట్నంలో విచారణ ప్రారంభమై నాలుగేళ్లు సాగింది. దర్యాప్తు అధికారులు నిష్పాక్షికంగా దర్యాప్తు జరపడంలో విఫలం కావడాన్ని న్యాయస్థానం ప్రధానంగా పేర్కొంది. మొదటి దర్యాప్తు అధికారి బి.ఆనందరావు మరణించినందున, రెండవ దర్యాప్తు అధికారిగా ఎం.శివానంద రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసిన అపెక్స్ కమిటీకి సిఫార్సు చేయాలని ఆదేశించింది. ఉద్దేశపూర్వకంగా సరైన విచారణ నిర్వహించని దర్యాప్తు అధికారులపై విచారణకు ఈ కమిటీని ఏర్పాటు చేశారు. పోలీసులను నిర్దోషులుగా కోర్టు విడుదల చేసిందని, అత్యాచార బాధితులకు జిల్లా న్యాయ సేవల యంత్రాంగం ద్వారా నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించిందని హక్కుల ఫోరం ప్రకటన పేర్కొంది. వాకపల్లి అత్యాచార బాధితురాలికి నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించిందంటే, వారి వాదనలపై న్యాయస్థానం విశ్వాసం చూపినట్లేనని, కేసు ప్రారంభంలోనే దర్యాప్తు రాజీపడిరదన్న మహిళా, ఆదివాసీ, హక్కుల సంస్థల దీర్ఘకాల ఆరోపణను ఇది సమర్థిస్తుందని వెల్లడిరచింది. తోటి పోలీసు సిబ్బందికి రక్షణ కల్పించేందుకే మొదటి రోజు నుంచి విచారణ దురుద్దేశపూర్వకంగా జరిగిందని తెలిపింది. క్రిమినల్ కోడ్ నిర్దేశించిన విధానాలు ఏవీ దర్యాప్తు అధికారులు పాటించలేదని పేర్కొంది. నిరక్షరాస్యులైనప్పటికీ, బాధితులు తమ పోరాటాన్ని విరమించుకోలేదని, న్యాయం కోసం పోరాడారని పేర్కొంది.