Monday, March 27, 2023
Monday, March 27, 2023

వారాహి వాహనంలో మచిలీపట్నం బయల్దేరిన పవన్ కల్యాణ్

మచిలీపట్నంలో ఆవిర్భావ సభ
క్రిక్కిరిసిపోయిన విజయవాడ-బందరు రోడ్డు

మచిలీపట్నంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరగనున్న నేపథ్యంలో, జనసేనాని పవన్ కల్యాణ్ విజయవాడ ఆటోనగర్ నుంచి వారాహి వాహనంలో మచిలీపట్నం బయల్దేరారు. భారీగా పార్టీ శ్రేణులు వెంటరాగా, వారాహి నిదానంగా కదులుతోంది. విజయవాడ బందరు రోడ్డు జనంతో క్రిక్కిరిసిపోవడంతో దాదాపు ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. పవన్ ర్యాలీలో జనసందోహాన్ని అదుపుచేయడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.మచిలీపట్నం శివార్లలో దాదాపు 35 ఎకరాల్లో జనసేన ఆవిర్భావ సభ నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకు పవన్ సభాప్రాంగణానికి చేరుకోవాల్సి ఉండగా, ప్రస్తుతం విజయవాడలో భారీ జనసమూహం నడుమ వారాహి నిదానంగా కదులుతున్న తీరు చూస్తుంటే, పవన్ రాక ఆలస్యమయ్యేట్టుంది. రాత్రి 9 గంటల వరకు జనసేన సభ జరగనుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img