Monday, January 30, 2023
Monday, January 30, 2023

వాస్తవాలను తెలియచేస్తే నోటీసులా? : బోండా ఉమా

గంజాయిపై వాస్తవాలను ప్రజలకు తెలియచేస్తే ఆనందబాబుకి నోటీసులు ఇస్తారా అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమా ప్రశ్నించారు. ఏపీని మాదకద్రవ్యాలకి అడ్డాగా వైసీపీ మార్చేసిందని అన్నారు. వైజాగ్‌లోనే గాక రాష్ట్రమంతటా వైసీపీ నాయకులు గంజాయి వ్యాపారం హోల్‌సేల్‌గా చేస్తున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో పోలీసులు నిందితులకు రక్షణ కల్పిస్తున్నారని… కంప్లైంట్స్‌కి వేధింపులకు గురిచేస్తున్నారని అన్నారు. ఏపీలో 9 వేల ఎకరాలు గంజాయి సాగు జరుగుతుంది అని కేంద్ర నిఘా వర్గాలు అంటున్నాయని తెలిపారు. దేశంలో పక్క రాష్ట్రాలలో ఎక్కడ గంజాయి దొరికినా ఏపీలోనే దాని మూలాలు ఉంటున్నాయన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img