Saturday, September 23, 2023
Saturday, September 23, 2023

విచ్చలవిడిగా ప్రభుత్వ ఆస్తుల అమ్మకాలు

మోదీ సర్కారు తీరుపై ఓబులేశు ఆగ్రహం

కడప : నేషనల్‌ మానిటైజేషన్‌ పైపులైన్‌(ఎంఎన్‌పీ) పేరిట కేంద్ర ప్రభుత్వం గంపగుత్తగా ప్రభుత్వ ఆస్తులు అమ్మేస్తోందని, భవిష్యత్‌ తరాల ఆస్తులు తాకట్టు పెడుతున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.ఓబులేశు విమర్శించారు. కడపలోని రహమతియా ఫంక్షన్‌ హాలులో సీపీఐ జిల్లాస్థాయి రాజకీయ శిక్షణా తరగ తులు జరిగాయి. ఓబులేశు మాట్లాడుతూ దేశంలో బూర్జువా పార్టీలు పరస్పర ప్రత్యామ్నాయంగా కొనసాగుతున్నాయని ఆరోపించారు. అలాంటి పార్టీలకు బూర్జువా పత్రికలు, ప్రసార మాధ్యమాలు అండగా నిలుస్తున్నాయన్నారు. పెట్రో ధరల పెరుగుదలపై మోదీ సర్కారును ఒక్క మాట కూడా అనని టీడీపీ…రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతుందని విమర్శించారు. వైసీపీ, టీడీపీ రెండూ పరస్పరం విమర్శిం చుకుంటూ మోదీకి దాసోహమంటున్నాయని చెప్పారు. టీడీపీ, వైసీపీ తృతీయశ్రేణి నాయకులు ప్రశ్నిస్తే పత్రికలు నాలుగు కాలాల వార్తలు ప్రచురిస్తాయని, అదే సీపీఐ జాతీయ, రాష్ట్ర నాయకులు ఉద్యమాలు చేసినా ప్రచురిం చడం లేదని, ప్రజలకు వాస్తవాలు తెలియకుండా పార్టీ అజెండాలే వార్త కథనాలుగా మభ్యపెడుతున్నాయని ఓబు లేశు మండిపడ్డారు. బూర్జువా ప్రసార మాధ్యమాలు తమ అభిప్రాయాలను ప్రజాభిప్రాయంగా ప్రచారం చేస్తున్నా యన్నారు. అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకం గా సీపీఐ పోరాటం చేస్తోందన్నారు. బీజేపీ ఏడేళ్ల పాలనలో దేశంలో ఒక్క పరిశ్రమను స్థాపించలేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌ లో విశాఖపట్నం ఉక్కును కేంద్రం ప్రైవేటీకరిస్తోందని, అందులో 18 వేల మంది పర్మినెంట్‌ ఉద్యోగులు ఉన్నారని, ఐదువేల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉద్యోగులు ఉన్నారన్నారు. ప్రైవేటీ కరణతో బడుగులకు ఉద్యోగ అవకాశాలు ఉండవన్నారు. నాడు ఇందిరాగాంధీ బ్యాంకులన్నింటినీ ప్రభుత్వ అధీనం లోకి తెస్తే నేడు బీజేపీ 500 బ్యాంకులను ప్రైవేటీకరి స్తోందన్నారు. 28 వేల జాతీయ రహదారులు, 120 రైల్వేలైన్లు, విద్యుత్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌ను గంపగుత్తగా అమ్మే స్తోందని ఆరోపించారు. జిల్లా కార్యదర్శి జి.ఈశ్వరయ్య మాట్లాడుతూ జిల్లా సమగ్రాభివృద్ధికి రానున్న కాలంలో పోరా టాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా కష్టకాలంలో పోరాటాలకు అంతరాయం కలిగిందన్నారు కరోనాను సాకుగా చేసుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విచ్చలవిడిగా ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నా యన్నారు. జిల్లా మాజీ కార్యదర్శి పులి కృష్ణమూర్తి పతాకావిష్కరణ చేశారు. రాజకీయ శిక్షణా తరగతుల్లో బి రామయ్య మార్కిస్టు తత్వశాస్త్రం, డాక్టర్‌ నరసింహులు రాజకీయ అర్థశాస్త్రం, డాక్టర్‌ సావంత్‌ సుధాకర్‌ పార్టీ ప్రచారం, పద్ధతులు, డి.సారయ్య మతం మూఢనమ్మకాలు అంశాలపై బోధన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకట శివ, సుబ్రహ్మణ్యం, బసీరున్నిసా, విజయలక్ష్మి, ఎంవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img