Thursday, September 29, 2022
Thursday, September 29, 2022

విజయవాడలో కోర్టు కాంప్లెక్స్‌ను ప్రారంభించిన సీజేఐ ఎన్వీ రమణ..

విజయవాడ న్యాయస్థానాల ప్రాంగణంలో నిర్మించిన జీ ప్లస్‌ 7 నూతన భవనాలను ఈ ఉదయం సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్‌, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, ఇతర న్యాయమూర్తులు హాజరయ్యారు. కోర్టు ప్రారంభోత్సవం అనంతరం కోర్టు కాంప్లెక్స్‌ ఆవరణలో సీజేఐ రమణ, సీఎం జగన్‌ లు మొక్కలు నాటారు. కోర్టు భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముందు సీజేఐ ఎన్వీ రమణను ముఖ్యమంత్రి జగన్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమం అనంతరం ఆయన ఆచార్య నాగార్జున విశ్యవిద్యాలయానికి చేరుకుంటారు. అక్కడ స్నాతకోత్సవం కార్యక్రమంలో చీఫ్‌ గెస్ట్‌గా పాల్గొనడంతో పాటు… విశ్వవిద్యాలయం ప్రదానం చేసే డాక్టరేట్‌ను స్వీకరిస్తారు. ఈ కార్యక్రమాంలో రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, యూనివర్శిటీ వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ పట్టేటి రాజశేఖర్‌ తదితరులు పాల్గొంటారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img