Wednesday, February 1, 2023
Wednesday, February 1, 2023

విజయవాడ మీదుగా ఆ రూట్లలో ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ అధికారులు పలు రూట్లలో కొత్త రైళ్లను నడుపుతున్నారు. జనవరి, ఫిబ్రవరిలో విజయవాడ మీదుగా రైళ్లు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈనెల 20 నుంచి ఫిబ్రవరి 25 వరకు విజయవాడ నుంచి నాగర్‌సోల్‌కు 07698/07699 అనే నంబర్‌ గల ప్రత్యేక రైలును, 21 నుంచి ఫిబ్రవరి 28 వరకు లింగంపల్లి నుంచి కాకినాడ టౌన్‌కు 07445/07446 అనే నంబర్‌ గల రైలును నడుపుతున్నామని వివరించారు. జనవరి 22 నుంచి ఫిబ్రవరి 26 వరకు 07185/07186 అనే నంబర్‌గల ప్రత్యేక రైలు మచిలీపట్నం నుంచి సికింద్రాబాద్‌ వరకు నడుపుతున్నామని అన్నారు. ఈనెల 21 నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు హైదరాబాద్‌ నుంచి నర్సాపూర్‌కు 07631/07632 అనే నంబర్‌ గల రైలును నడుపుతున్నట్లు వివరించారు. ఈనెల 19 నుంచి ఫిబ్రవరి 28 వరకు 07067/07068 మచిలిపట్నం నుంచి కర్నూలు వరకు, ఈనెల 18 నుంచి ఫిబ్రవరి 28 వరకు 07095/07096 అనే రైలును మచిలీ పట్నం నుంచి తిరుపతి వరకు నడుపుతున్నామని రైల్వే అధికారులు వివరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img