Wednesday, February 1, 2023
Wednesday, February 1, 2023

విద్యార్థుల అస్వస్థత..వైద్యసేవల్లో ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా చూడాలి

మంత్రి ఆదిమూలపు సురేష్‌
కృష్ణా జిల్లా మచిలీపట్నం మైనారిటీ గురుకుల పాఠశాలలో విద్యార్థుల అస్వస్థతపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అధికారులతో మాట్లాడారు. వైద్య సేవల్లో ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.వాతావరణ మార్పులతో వచ్చే వైరల్‌ జ్వరాలతో అస్వస్థతకు గురైనట్టు అధికారులు తెలిపారు. మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. విద్యా, వైద్య శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో విద్యార్థుల అస్వస్థతపై మంత్రి నివేదిక కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img