Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

విద్యార్థుల భవిష్యత్తు గురించే ఆలోచిస్తున్నాం..

సీఎం జగన్‌
‘పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువే.. ప్రతి అడుగులోను విద్యార్థుల భవిష్యత్తు గురించే ఆలోచిస్తున్నాం’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఈ ఏడాదికి గాను జగనన్న విద్యా దీవెన రెండో విడత సొమ్మును ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. దాదాపు 10.97 లక్షల మంది విద్యార్థులకు రూ.693.81 కోట్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ..తల్లిదండ్రులకు భారం లేకుండా విద్యాదీవెన అమలు చేస్తున్నాం. ప్రతి పేద విద్యార్థికి చదువు అందుబాటులోకి రావాలన్నదే తమ ప్రభుత్వం లక్ష్యమని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img