Thursday, February 9, 2023
Thursday, February 9, 2023

విద్యుత్‌ కోతలపై వదంతులు నమ్మొద్దు

ఏపీ ఇంధన శాఖ
ఏపీలో కరెంట్‌ కోతలు ఉండవని ఏపీ ఇంధన శాఖ తెలిపింది. సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలు తప్పన్నారు.పట్టణాలు, గ్రామాల్లో గంటల తరబడి కోతలంటూ చేస్తోన్న దుష్ప్రచారాన్ని ఇంధన శాఖ అధికారులు తప్పుబట్టారు. విద్యుత్‌ సంక్షోభాన్ని అధిగమించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, నాణ్యమైన విద్యుత్‌ సరఫరాకు డిస్కమ్‌లు చర్యలు చేపట్టాయని తెలిపారు. విద్యుత్‌ కోతలపై వదంతులు నమ్మొద్దని విద్యుత్‌ ఉత్పత్తికి అవసరమైన బొగ్గును ప్రభుత్వం సరఫరా చేసిందని ఈపీడీసీఎల్‌ సీఎండీ సంతోష్‌రావు చెప్పారు. విద్యుత్‌ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img