Monday, March 20, 2023
Monday, March 20, 2023

విశాఖలో ఆలస్యంగా బయలుదేరిన వందేభారత్‌..

విశాఖపట్నం-సికింద్రాబాద్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు మూడు గంటలపాటు ఆలస్యంగా నడువనుందని రైల్వే అధికారులు పేర్కొన్నారు. బుధవారం ఉదయం ఘట్‌కేసర్‌ వద్ద గోదావరి ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. దీంతో రైలు పట్టాలు దెబ్బతిన్నాయి. ఈనేపథ్యంలో రైల్వే అధికారులు పలు రైళ్లను రీషెడ్యూల్‌ చేయడంతోపాటు మరికొన్ని రైళ్లను రద్దు చేశారు. పలు రైళ్లను దారిమళ్లించారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఉదయం 5.45 గంటలకు బయలుదేరాల్సిన వందేభారత్‌ రైలు.. ఉదయం 8.45 గంటలకు ప్రారంభం కానుంది. దీంతో మధ్యాహ్నం 2.15 గంటలకు బదులుగా మధ్యాహ్నం 5 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకోనున్నది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img