Saturday, November 26, 2022
Saturday, November 26, 2022

విశాఖ వేదికగా గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌.. మంత్రి అమర్నాథ్‌

విశాఖలో గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌-2023 నిర్వహిస్తున్నట్లు ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ తెలిపారు. మార్చి 3, 4 తేదీల్లో నిర్వహించే ఈ సమ్మిట్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పారిశ్రామిక వేత్తలను ఆహ్వానిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు వచ్చేలా ఈ ప్రతిష్ఠాత్మక సదస్సును నిర్వహిస్తున్నామన్నారు. గత మూడేళ్లలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి సమ్మిట్‌ నిర్వహించలేదన్నారు.అలాగే ఈ సమ్మిట్‌ ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తామన్నారు. సమ్మిట్‌ కు ముందు పలు దేశాల్లో రోడ్‌ షోల నిర్వహణ ద్వారా పారిశ్రామిక వేత్తలను ఆహ్వానిస్తామన్నారు. ఈ సమ్మిట్‌ను విజయవంతం చేసేందుకు ఏపీలోని పారిశ్రామిక వేత్తలే బ్రాండ్‌ అంబాసిడర్లుగా వ్యవహరిస్తారని మంత్రి పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img