విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రస్తుతానికి ప్రైవేటీకరణ విషయంలో ముందుకు వెళ్లడం లేదని కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ స్పష్టం చేశారు. ఆర్ఐఎన్ఎల్ ను బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. స్టీల్ ప్లాంట్ మనుగడ కోసం ఆర్ఐఎన్ఎల్ యాజమాన్యంతోనూ.. అలాగే కార్మిక సంఘాల నేతలతోనూ చర్చిస్తామని పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో పనిచేసేందుకు అవసరమైన చర్యలను చేపట్టనున్నట్లు విశాఖలో కేంద్ర ఉక్కుగనుల సహాయ ఫగ్గన్ సింగ్ ప్రకటించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో తెలంగాణ బిడ్ లో పాల్గొనడం రాజకీయ ఎత్తుగడేనని కొట్టిపారేశారు.