Thursday, March 23, 2023
Thursday, March 23, 2023

విస్తృతస్థాయి అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం

జగనన్న ఇంటికి ఐదు లక్షలు ఇవ్వాలి….

  • సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీష్

విశాలాంధ్ర-గుంతకల్లు : రాష్ట్రంలో పేద ప్రజలకు సొంతింటి కళ నెరవేరాలంటే జగనన్న ఇంటికి ఐదు లక్షలు ఇవ్వాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీష్ డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక భీటీ పకీరప్ప ఫంక్షన్ హాల్ లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీష్ ఆధ్వర్యంలో సొంత ఇల్లు కోసం లబ్ధిదారుల ఘోషపై అఖిలపక్ష పార్టీల విస్తృత సాయి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని సిపిఐ నియోజవర్గం కార్యదర్శి వీరభద్రస్వామి అధ్యక్షత వహించారు. రౌండ్ టేబుల్ సమావేశంలో సీపీఐ నియోజికవర్గం సహాయ కార్యదర్శి బి.మహేష్ , సిపిఐ పట్టణ కార్యదర్శి గోపీనాథ్,టిడిపి నాయకులు కే.సి.హరి,వెంకట శివుడు,హిమబిందు,కాంగ్రెస్ పార్టి దౌల్తాపురం ప్రభాకర్ ,బిఎస్పి పార్టి శ్రీనివాసరాజు,జైభీమ్ పార్టి గౌసియా,ఎం ఆర్ పి ఎస్ వి.ఆనంద్ ,సంచార జాతుల రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసులు, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి పిసి కుల్లాయప్ప, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దేవేంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీష్ మాట్లాడుతూ రాష్ట్రంలో జగనన్న ఇంటికి 1,80,000 ఏమాత్రం సరిపోదని 5 లక్షల రూపాయలు ఇవ్వాలని,అదేవిధంగా టిడ్కో ఇంటి నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వాలని, ఇంటి స్థలం లేని నిరుపేదలకు 90 రోజుల్లో స్థలాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో సిపిఐ జిల్లా నాయకులు అబ్దుల్ వహాబ్ ,సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి ఎస్ ఎండి గౌస్ ,సిపిఐ మండల కార్యదర్శి రాము రాయల్, మండల సహాయ కార్యదర్శి రామాంజనేయులు, ఏఐటీయూసీ మండల కార్యదర్శి ఈశ్వరయ్య ,మహిళా సమైక్య నియోజకవర్గం కార్యదర్శి రామాంజనమ్మ, సిపిఐ నాయకులు మల్లయ్య,బాబా ఫక్రుద్దీన్, ప్రసాద్ ,ఉమ్మర్ భాష, మురళీకృష్ణ ,నందు, కొట్టాల సూరి ,ఏఐఎస్ఎఫ్ నాయకులు వెంకట్ నాయక్, వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img