Thursday, February 9, 2023
Thursday, February 9, 2023

వైఎస్సార్‌ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్‌..

‘నాడు`నేడు’ పనులతో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మారుస్తున్నామని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. విజయవాడలో ‘డాక్టర్‌ వైఎస్సార్‌ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌’ వాహనాలను ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి పారంభించారు. విజయవాడలోని బెంజ్‌ సర్కిల్‌ వేదికగా శుక్రవారం సీఎం జగన్‌ జెండా ఊపి ఈ వాహనాలను ప్రారంభించారు. ప్రభుత్వాస్పత్రిలో ప్రసవానంతరం తల్లీబిడ్డను సురక్షితంగా, సౌకర్యవంతంగా ఇంటికి చేర్చే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం 500 ‘డాక్టర్‌ వైఎస్సార్‌ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌’ వాహనాలను ప్రారంభించారు. అరకొరగా ఉన్న పాత వాహనాల స్థానంలో 500 కొత్త వాహనాలను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ఈ రోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. అక్కచెల్లెమ్మల కోసం అత్యాధునిక వాహనాలను అందుబాటులోకి తెచ్చినట్లుగా ప్రకటించారు. ఆస్పత్రుల్లో నాణ్యమైన సేవలు అందించేలా చర్యలు చేపడుతున్నామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img