Sunday, October 2, 2022
Sunday, October 2, 2022

వైఎస్‌ఆర్‌ గురించి పాట పాడిన వెంకాయమ్మ.. స్వయంగా వెళ్లి ఆమె పాట ఆపిన జగన్‌

దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డిపై ఓ పాట అందుకుంది ప్రకాశం జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ గా కొనసాగుతోన్న బూచేపల్లి వెంకాయ్మ. కాగా సీఎం జగన్‌ వారిస్తున్నా.. ఆమె ఆ పాటను కొనసాగించారు. ఈ క్రమంలో జగన్‌ సూచన మేరకు వెంకాయమ్మ కుమారుడు, దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద రెడ్డి ఆమె వద్దకెళ్లి ఆమె పాటను నిలిపే యత్నం చేశారు. అయినా కూడా ఆమె వినకుండా పాటను కొనసాగించడంతో ఉన్నట్టుండి కుర్చీలో నుంచి లేచిన జగన్‌.. పరుగున వెంకాయమ్మ వద్దకు వెళ్లారు. వెంకాయమ్మను తన రెండు చేతులతో పట్టుకుని ఆమె సీటు వద్దకు బలవంతంగా తీసుకొని వచ్చారు. ఆ తర్వాత ఆమెను ఆమెకు కేటాయించిన కుర్చీలో కూర్చోబెట్టారు. క్షణాల వ్యవధిలో జరిగిన సన్నివేశం వైరల్‌గా మారిపోయింది. జగన్‌ బుధవారం ప్రకాశం జిల్లా చీమకుర్తిలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చీమకుర్తిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభా వేదికపై ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img