Thursday, October 6, 2022
Thursday, October 6, 2022

వైఎస్‌ రాజశేఖరరెడ్డికి ఘన నివాళి అర్పించిన జగన్‌, కుటుంబసభ్యులు

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌ జిల్లాలో రెండోరోజు పర్యటిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్థంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద ఆయన నివాళులర్పించారు. సీఎంతో పాటు ఆయన కుటుంబసభ్యులు వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ భారతి, వైఎస్‌ షర్మిల వైఎస్సార్‌కు నివాళులర్పించారు. అనంతరం కుటుంబసభ్యులతో కలిసి వైఎస్‌ జగన్‌ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.
వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద వైఎస్సార్‌కు నివాళి అనంతరం పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిపై సీఎం జగన్‌ సమీక్ష చేపట్టారు. విడతల వారీగా సాయంత్రం వరకు పులివెందుల నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఇతర అంశాల పై స్థానిక నాయకులు, అధికారులతో సీఎం సమీక్ష జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img