Thursday, September 29, 2022
Thursday, September 29, 2022

వైద్య, విద్యారంగంలో అనేక మార్పులు తీసుకొచ్చాం : సీఎం జగన్‌

వైద్య, విద్యారంగంలో అనేక మార్పులు తీసుకొచ్చామని సీఎం జగన్‌ అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ, కొవిడ్‌ ఉన్నా ఏపీ స్థూల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని తెలిపారు. 2021-22లో 11.43 శాతం జీఎస్టీ పెరుగుదలలో ఏపీ నెంబర్‌ వన్‌ స్థానంలో ఉందని తెలిపారు. గడచిన మూడేళ్లలో సగటున 5 శాతం జీఎస్టీ పెరిగిందని పేర్కొన్నారు. కొనుగోలు శక్తి పడిపోకుండా అమ్మఒడి, చేయూత, ఆసరా, రైతు భరోసా లాంటి పథకాలు పనికొస్తున్నాయని వివరించారు. నాడు-నేడు ద్వారా మూలధన వ్యయం చేస్తున్నామన్నారు. రుణాల పెరుగుదల శాతం 17.4 నుంచి 12.7కు తగ్గిందని తెలిపారు. ప్రభుత్వ గ్యారెంటీలతో కార్పొరేషన్ల ద్వారా రుణాలు 1,17,730 కోట్లు.. మొత్తం అప్పు 4,99,895 కోట్లకు చేరాయని వివరించారు. మూడేళ్లలో పెరిగిన రాష్ట్ర రుణం 52.07 శాతం మాత్రమేనని తెలిపారు. జీడీపీలో రుణ శాతం దేశ సగటుతో పోలిస్తే గణనీయంగా తగ్గిందన్నారు. రాష్ట్రం విడిపోయే నాటికి రాష్ట్రరుణం రూ.1.20 లక్షలు ఉంటే.. మాజీసీఎం చంద్రబాబు హయాంలో 2,69,462 కోట్లకు పెరిగాయని జగన్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img