Thursday, February 9, 2023
Thursday, February 9, 2023

వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే..ఏపీ సర్కారుపై కామెంట్స్‌

మంత్రి వెల్లంపల్లి
తెలంగాణ ముఖ్యమంత్రి గానీ, ఆ రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు కానీ ఏపీపై అవాకులు చవాకాలు మాట్లాడటం మంచిపద్ధతి కాదని, ఇలాంటి విధానాలు మానుకుంటే మంచిదని ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు.శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి పదే పదే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై కామెంట్స్‌ చేస్తున్నారని అన్నారు. ఆయన.. చంద్రబాబుపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అధికారంలో ఉంటే ఒకలా మాట్లాడుతారు.. అధికారంలో లేకపోతే మరోలా మాట్లాడుతారని అన్నారు. కుప్పం నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురవేయడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు.కాగా, శనివారం మంత్రి శ్రీశైలం శ్రీబ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీశైలం దేవస్థానం అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామని ప్రకటించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img