వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనకు షరతులతో కూడిన డిఫాల్ట్ బెయిల్ ను మంజూరు చేసింది. అయితే, షరతులను కింది కోర్టు విధించాలని ఆదేశించింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఈ మేరకు తీర్పును వెలువరించింది. అనంతబాబుపై రాష్ట్ర ప్రభుత్వం పదేపదే ఉపసంహరించుకోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు సుబ్రహ్మణ్యం పలుకుబడి కలిగిన వ్యక్తి అని, ఆయన బెయిల్ పై విడుదలైతే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని, అందువల్ల ఆయనకు బెయిల్ ఇవ్వకూడదంటూ మృతుడు సుబ్రహ్మణ్యం తల్లి వేసిన పిటిషన్ ను విచారించడానికి ధర్మాసనం నిరాకరించింది. తదుపరి విచారణను మార్చ్ నెలకు వాయిదా వేసింది.