బీసీల పొట్టగొట్టి జగన్ తన పొట్ట పెంచుకుంటున్నారని ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ, టీడీపీ అధికారంలోకి వస్తే బీసీలను వెతుక్కుంటూ వచ్చి పదవులు ఇచ్చే బాధ్యత తనదని చంద్రబాబు హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో పేరుకే బీసీలకు కొన్ని పదవులని, పెత్తనమంతా అగ్ర కులాలకేనని మండిపడ్డారు. మాయ మాటలు చెప్పి బీసీలను నట్టేట ముంచారని ఆరోపించారు. టీటీడీలో 16 పదవులు బీసీలకు ఇవ్వాల్సి ఉండగా మూడు పదవులు మాత్రమే ఇచ్చారన్నారు.