Friday, September 30, 2022
Friday, September 30, 2022

వైసీపీ ప్రభుత్వానికి ఉద్యోగులు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తారు : అశోక్‌బాబు

వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 13.35 లక్షల మంది ఉద్యోగులు వైసీపీ ప్రభుత్వానికి రిటర్న్‌ గిఫ్ట్‌ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు అన్నారు. ద్యోగులు ఇచ్చే ఈ గిఫ్ట్‌ను సకల సలహాదారులు, పోలీసులు ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం వల్ల 10 శాతం మంది ఉద్యోగులకు కూడా లబ్ధి చేకూరలేదన్నారు. ఉద్యోగుల న్యాయబద్ధమైన డిమాండ్లకు టీడీపీ మద్దతు ఉంటుందని వెల్లడిరచారు. ఉద్యోగులతో తాత్కాలికంగా సమ్మె విరమింపజేయగలరేమో కానీ… ఉద్యోగుల సంకల్పాన్ని మాత్రం మార్చలేరని స్పష్టం చేశారు. క్విట్‌ ఇండియా ఉద్యమంలా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల పోరాటం జరుగుతోందని అభివర్ణించారు. సీపీఎస్‌ రద్దు చేస్తామని మాటిచ్చిన జగన్‌ మడమ తిప్పారని, పోలీసుల సాయంతో ఉద్యోగులను నిర్బంధిస్తున్నారని విమర్శించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img