Tuesday, January 31, 2023
Tuesday, January 31, 2023

శాంతి భద్రతల పరిరక్షణలో ఎక్కడ రాజీ పడకుండా పనిచేస్తాం

హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తానేటి వనిత
ఆంధ్రప్రదేశ్‌ హోంశాఖ మంత్రిగా తానేటి వనిత సోమవారం సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సీఎం జగన్‌ అప్పగించిన బాధ్యతను శక్తి వంచన లేకుండా నిర్వర్తిస్తానని తెలిపారు.న్యాయం, చట్టం వివక్ష లేకుండా అందిస్తున్న ప్రభుత్వంలో.. ఫ్రెండ్లీ పోలీస్‌, క్విక్లీ రెస్పాన్స్‌ విధానంతో పనిచేస్తామని అన్నారు. ‘టెక్నాలజీ వినియోగలోనూ మన పోలీస్‌ విభాగం దేశంలోనే నెంబర్‌ వన్‌ స్థానంలో నిలిచింది. రాబోయే రెండేళ్లు మరింత సమర్థవంతంగా పనిచేస్తాం. మహిళలపై నేరాల నియంత్రణకు కృషి చేస్తాం. దిశ చట్టం కేంద్రంలో పెండిరగ్‌లో ఉన్నా అందులోని అంశాలను అమలు చేస్తున్నాం. దిశా యాప్‌ ద్వారా 900 మందికిపైగా ఆడపిల్లల్లను కాపాడారు. పోలీస్‌ వ్యవస్థలో పారదర్శకత, ఫ్రెండ్లీ పోలీసింగ్‌, క్విక్‌ రెస్పాన్స్‌ అమలును కొనసాగిస్తాం. శాంతి భద్రతల పరిరక్షణలో ఎక్కడ రాజీ పడకుండా పనిచేస్తాం. జగనన్న స్ఫూర్తి తోనే పనిచేస్తాం’ అని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img