Tuesday, October 4, 2022
Tuesday, October 4, 2022

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద.. 10 గేట్లు ఎత్తివేత..

శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో అధికారులు జలాశయం 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. జలాశయం ఇన్‌ ఫ్లో 3,17,736 క్యూసెక్కులు, ఔట్‌ ఫ్లో 3,77,373 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883.90 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలకు గాను ప్రస్తుతం 209.1579 టీఎంసీలుగా నమోదు అయ్యింది. మరోవైపు కుడి, ఎడమ జలవిద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img