Sunday, December 4, 2022
Sunday, December 4, 2022

శ్రీశైలం ప్రాజెక్టు 5 గేట్ల ఎత్తివేత..

ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఐదు గేట్లను పది అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్‌ ఇన్‌ ఫ్లో: 1,47,405 క్యూసెక్కులు కాగా, ఔట్‌ ఫ్లో : 2,05,432 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్ట్‌ పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులుగా ఉండగా, ప్రస్తుతం 884.50 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుతం : 212.9198 టీఎంసీలుగా కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్ట్‌ కుడి, ఎడమ జలవిద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img