Tuesday, October 4, 2022
Tuesday, October 4, 2022

శ్రీశైలం ప్రాజెక్ట్‌ 10 గేట్లు ఎత్తివేత..

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. వరద పెరగడంతో ప్రాజెక్ట్‌?లోకి భారీగా నీరు వచ్చి చేరుతుంది. అధికారులు 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్‌ ఇన్‌ఫ్లో 2,98,404 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 3,43,376 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. శ్రీశైలం పూర్తి, ప్రస్తుత నీటిమట్టం 885 అడుగులుగా ఉంది. శ్రీశైలం పూర్తి, ప్రస్తుత నీటినిల్వ 215.8070 టీఎంసీలు కాగా, కుడి, ఎడమ జలవిద్యుత్‌ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img