Tuesday, December 5, 2023
Tuesday, December 5, 2023

సంక్షేమ పాలనకు ప్రజలు పట్టం కట్టారు

మంత్రి బొత్స సత్యనారాయణ
ఎన్నికల తీర్పు స్పూర్తితో ప్రజల సేవకు సీఎం జగన్‌ పునరంకితమవుతారని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సంక్షేమ పాలనకు ప్రజలు పట్టం కట్టారని అన్నారు. ఎన్నికల బహిష్కరణ అనేది టీడీపీ డ్రామా అని మండిపడ్డారు. టీడీపీ విలువలు కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఎన్నికలు బహిష్కరణ అంటే నామినేషన్లకు ముందే తెలియజేయాలన్నారు. టీడీపీకి ప్రజల్లో మనుగడ లేదని ఎద్దేవా చేశారు. టీడీపీకి ఓటమిని అంగీకరించే ధైర్యం లేదన్నారు. ఓటమిని అంగీకరించి ఫలితాలను విశ్లేషించుకోవాలని హితవు పలికారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img