డీజీపీ గౌతం సవాంగ్
పోలీసులు సేవాభావంతో పనిచేయాలని డీజీపీ గౌతం సవాంగ్ సూచించారు. సామాన్య ప్రజలకు సేవలు అందడంపై పోలీసులు దృష్టి పెట్టాలన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు పోలీస్ సేవలు అందేలా కృషిచేయాలన్నారు. గ్రామీణ సచివాలయ మహిళా పోలీస్ వ్యవస్థ బలంగా ఉందన్నారు. సచివాలయ మహిళా పోలీస్ వ్యవస్థ వలన గ్రామాల్లో మహిళలకు భద్రత పెరిగిందని పేర్కొన్నారు.