Monday, January 30, 2023
Monday, January 30, 2023

సారా వ్యాపారం రాజమండ్రి ఎంపీకి కనిపించడం లేదా?

టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి

ఆంధ్రప్రదేశ్‌లో కోటి కేజీల గంజాయి ఉత్పత్తి అవుతుందని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. పోలీస్‌ శాఖ గంజాయిని ఎందుకు ఆపలేకపోతోందని ప్రశ్నించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సారాయిని రంగుగా మార్చి విస్కీ, బ్రాందీలుగా అమ్ముతున్నారని, బాటిల్‌లో సారా వేసి 100 రూపాయిలకు అమ్ముతున్నారని విమర్శించారు. సారా వ్యాపారం రాజమండ్రి ఎంపీకి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. సారా అమ్మిస్తున్నందుకు ఎంపీని జైలులో పెట్టాలన్నారు. ఇళ్ళ స్థలాల ముసుగులో ఎంపీ దోపిడీకి పాల్పడుతున్నారని, ఆయన నాయకత్వంలో రూ. 100 కోట్లు దోచుకున్నారని ఆరోపించారు.ఆర్థిక ఉగ్రవాది చేతిలో రాష్ట్రం నష్టపోతోందన్నారు. టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టినప్పుడు పోలీస్‌ సంఘాల నేతలు ఎందుకు మాట్లాడంలేదని ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img