Monday, September 26, 2022
Monday, September 26, 2022

సినిమాలు వేరు..రాజకీయాలు వేరు…

పవన్‌ కల్యాణ్‌కు సవాల్‌ విసిరిన ఏపీ మంత్రి ధర్మాన
తనకు ఇప్పుడు 64 ఏళ్లని, పవన్‌ తనతో పాటు నడవగలరా? అన్నారు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అని పవన్‌ కల్యాణ్‌ గ్రహించాలని ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సూచించారు. ‘‘సినిమాలో బొమ్మలతో యాక్షన్‌ చేస్తారు. పవన్‌ నడుస్తానంటూ రాజకీయాల్లోకి వచ్చేశారు. నాతో నడవమనండి… కనీసం 3 కిలోమీటర్లు కూడా నడవలేరు. మాటలు చెప్పినంత సులభంగా ఏమీ ప్రజాజీవితం ఉండదు’’ అని ధర్మాన వ్యాఖ్యానించారు. అధికారం, పదవులు పట్టించుకోకుండా నాలుగున్నర దశాబ్దాలుగా ప్రజాజీవితంలో ఉన్నానని వెల్లడిరచారు. శ్రీకాకుళం జిల్లా లింగాలవలస గ్రామంలో మంత్రి ధర్మాన ‘గడపగడపకు…’ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, గ్రామంలో కనిపించిన పవన్‌ కల్యాణ్‌ పోస్టర్‌లో స్థానిక యువకుల ఫొటోలు కూడా ఉండడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగానే ఆయన పైవ్యాఖ్యలు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img