Tuesday, December 6, 2022
Tuesday, December 6, 2022

సిరిమానోత్సవానికి మొదటి అంకం -సిరిమాను చెట్టుకు పూజలు

పూజారికి పైడితల్లి అమ్మవారు కలలో కనిపించి చెప్పడంతో చెట్టుకు బొట్టు పెట్టి పూజలు నిర్వహించారు.దాంతో విజయనగరం పైడితల్లి అమ్మ వారి సిరిమానోత్సవానికి మొదటి అంకం మొదలయింది. ఈ క్రమంలోనే సిరిమాను చెట్టుకు పూజలు చేయడానికి భక్తులు పోటెత్తుతున్నారు. పైడితల్లి అమ్మ వారి సిరిమాను చెట్టును సిరిపురం గ్రామంలో గుర్తించారన్న సమాచారంతో భక్తులు భారీగా తరలివచ్చి ఆ చెట్టుకు పూజలు చేస్తున్నారు. తమ గ్రామంలోని చెట్లను అమ్మ వారు సూచించడంతో గ్రామస్తుల ఆనందానికి అవధులు లేవు. జంటగా పుట్టిన 15 అడుగుల చింతచెట్లను పైడితల్లి అమ్మ వారు పూజారికి కలలో సూచిస్తారు. దీంతో ఆ చెట్లకు పూజలు చేసి సిరిమానుకు ఉపయోగిస్తారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు ప్రతి ఏటా దసరా తరువాత పైడితల్లి అమ్మ వారి సిరిమానోత్సవం జరుగుతుంది. దీంతో నెలరోజుల ముందు నుంచే విజయనగరంలో పండుగ వాతావరణం నెలకొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img