Friday, December 2, 2022
Friday, December 2, 2022

సీఎం క్యాంపు కార్యాలయానికి కోడికత్తి శీను కుటుంబం..స్పందనలో పిటిషన్‌

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై 2019 ఎన్నికలకు ముందు విశాఖ విమానాశ్రయంలో కోడి కత్తితో దాడి చేసిన జనుపల్లి శ్రీనివాసరావు అలియాస్‌ శ్రీను వ్యవహారంలో బుధవారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. తన కుమారుడి బెయిల్‌ కోసం నిరభ్యంతర పత్రం ఇవ్వాలని సీఎం జగన్‌కు నిందితుడి తల్లిదండ్రులు లేఖ రాశారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రిని కలిసేందుకు శీను కుటుంబ సభ్యులు సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. లాయర్‌ సలీమ్‌తో పాటు శీను తల్లి సావిత్రి, సోదరుడు సుబ్బరాజు వచ్చారు. నాలుగేళ్లుగా రిమాండ్‌ ఖైదీగా ఇబ్బందులు పడుతుండడంతో తమ గోడు సీఎం చెప్పుకుంటామని శీను కుటుంబసభ్యులు వాపోతున్నారు. స్పందన కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు వినతి పత్రం ఇచ్చారు. నాలుగేళ్లుగా రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో కోడికత్తి దాడి కేసు నిందితుడు శ్రీనివాసరావు రిమాండ్‌ ఖైదీగా ఉన్నాడు. కుమారుడు జైలు పాలైనందున తాము కష్టాలు పడుతున్నట్లు లేఖలో సీఎంకు వివరించారు. వయోభారంతో ఉన్న తమ పోషణ కష్టంగా మారిందని జాలి చూపాలని సీఎంకు నిందితుడి తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img