ప్రముఖ సినీనటుడు, వైసీపీ నేత అలీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎంతో భేటీ అయ్యారు. కాగా జగన్ అలీకి రాజ్యసభ సీటు ను ఖరారు చేస్తున్నారన్న ప్రచారం నేపథ్యంలో ఈ భేటీ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. సమావేశం అనంతరం ఆలీ మీడియాతో మాట్లాడుతూ, సీఎం వైఎస్ జగన్‌ను కలిశానని చెప్పారు. త్వరలోనే గుడ్‌న్యూస్ ఉంటుందని ఆయన చెప్పారన్నారు. రెండు వారాల్లోనే ప్రకటన ఉంటుందని అనుకుంటున్నా అని అన్నారు. ఇక సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయని భావిస్తున్నానని అన్నారు.