పోలవరం నిర్వాసితుల సమస్యలు తక్షణమే పరిష్కరించి, వారి దీక్షలు విరమింపజేయాలంటూ సీఎం జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బహిరంగ లేఖ రాశారు. అందరికీ చట్టప్రకారం పునరావాసం కల్పించాలని, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అందరికీ ఇవ్వాలని అన్నారు. ముఖ్యమంత్రి గతంలో ప్రకటించిన 10 లక్షల ప్యాకేజీ అందించాలని కోరారు. 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన వారందరికీ ప్యాకేజీ వర్తింపజేయాలన్నారు. నిర్వాసితులకు కేటాయించిన కాలనీల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. గ్రామాలను ఖాళీ చేయించిన తేదీనే కటాఫ్ తేదీగా పరిగణించాలని పేర్కొన్నారు.