Saturday, June 10, 2023
Saturday, June 10, 2023

సీఎం జగన్ హెలికాప్టర్ లో సాంకేతిక లోపం..

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయాణించిన హెలికాప్టర్లో సాంకేతిక లోపం ఏర్పడడంతో రోడ్డుమార్గం ద్వారా పుట్టపర్తికి ప్రయాణమయ్యారు. బుధవారం జగనన్న వసతి జీవన కార్యక్రమంలో పాల్గొనేందుకు అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రానికి వచ్చారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో పుట్టపర్తి విమానాశ్రయానికి వచ్చిన ముఖ్యమంత్రి అక్కడ్నుంచి హెలికాప్టర్ లో నార్పలకు చేరుకున్నారు. ఉదయం ఆకాశం మేఘావృతం గా ఉన్నప్పటికీ హెలికాప్టర్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ల్యాండ్ అయింది. అయితే తిరుగు ప్రయాణంలో ఒంటిగంటకు బహిరంగ సభ ముగిసింది. సాంకేతిక లోపం వల్ల హెలికాప్టర్ పని చేయకపోవడంతో రోడ్డుమార్గం ద్వారా బత్తలపల్లి ధర్మవరం మీదుగా పుట్టపర్తికి ప్రత్యేక కాన్వాయ్ లో వెళ్లారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img